ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు.. | Married Woman Front Boyfriend House | Sakshi
Sakshi News home page

ప్రియుడు మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు విడాకులిచ్చింది..

May 26 2025 10:46 AM | Updated on May 26 2025 10:46 AM

Married Woman Front Boyfriend House

జ్యోతినగర్‌(కరీంనగర్): ఇరువురు ప్రేమించుకున్నారు. ఆపై యువతి మరొకరిని వివాహమాడింది. అయినా వాళ్ల ప్రేమ బంధం కొనసాగింది. ఈ క్రమంలో ఆమెకు ఒక పాప జన్మించింది. ప్రియుడు చెప్పిన మాటలను నమ్మి తాళి కట్టిన భర్తకు విడాకులిచ్చింది. ఈ తర్వాత ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో చేసేదేం లేక ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన చేపట్టింది. ఎన్టీపీసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామగుండం కార్పొరేషన్‌ ఐదో డివిజన్‌ నర్రాశాలపల్లెకు చెందిన మహిళ(26) ఆరు సంవత్సరాలుగా సమీప బంధువైన వ్యక్తితో ప్రే మాయణం కొనసాగింది. 

ఈ క్రమంలో మహిళ కుటుంబ సభ్యులు ఆమెకు మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశా రు. అయినా మహిళ ప్రేమించిన వ్యక్తితో సంబంధం కొనసాగింది. మూడు నెలల క్రితం ప్రియుడితో కలిసి మంచిర్యాల జిల్లాలోని ఓ ప్రాంతంలో గది అద్దెకు తీసుకొని ఉన్నారు. కుటుంబ సభ్యులు మహిళ అదృశ్యం కేసు సైతం నమోదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి సదరు మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని మహిళ తెలిపింది. కుటుంబ సభ్యులు కుల పెద్దలతో పంచాయితీలు నిర్వహించారు. భర్తతో విడాకులు తీసుకుంటే వివాహం చేసుకుంటానని ప్రియుడి మాటలు నమ్మి విడాకులు సైతం చేసుకుంది. విడాకులు పొందినా ప్రి యుడు పెండ్లికి నిరాకరించడంతో.. చేసేదేం లేక ప్రి యుడి ఇంటి ఎదుట నిరసన చేపట్టింది. దీంతో ప్రి యు డి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.  

పోలీసుల జోక్యంతో.. 
ఎస్సై మానస ఘటనా స్థలానికి చేరుకొని మహిళతో మాట్లాడారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో.. ఎనీ్టపీసీ పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement