
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ప్రిజం పబ్ ఫైరింగ్ మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది. టోలీచౌకిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్ధం విన్నామంటూ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ మాత్రమే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. భూ వివాదంలో అక్తర్ ఇంటికి షకీల్, అతని అనుచరులు చేరుకున్నారు. ప్లాట్ విషయంలో ఇరువర్గాలకు చెందిన వారు గొడవ పడ్డారు. ఇదే సమయంలో ఫైరింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఫేస్‌బుక్ పరిచయం.. వివాహితకు శాపం
Comments
Please login to add a commentAdd a comment