ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య | Man Ends Life Indiramma House Issue | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య

Jun 11 2025 11:16 AM | Updated on Jun 11 2025 11:16 AM

Man Ends Life Indiramma House Issue

తొగుట (సిద్ధిపేట జిల్లా): ఇందిరమ్మ ఇల్లు రాలేదని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని బండారుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నీరటి పర్శరాములు (42) కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. 

ఇల్లు మంజూరైనట్టు గ్రామంలోని కొందరు నాయకులు తెలపడంతో ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు అందుతాయన్న ఆశతో తెలిసిన వారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకుని బేస్‌మెంట్‌ వరకు నిర్మించాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత మంజూరైన ఇళ్ల జాబితాను ప్రభుత్వం రద్దు చేసిందంటూ బాధితుడికి నాయకులు చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ రవికాంత్‌రావు తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement