
– ఐర్లాండ్ దేశ ఎడ్యుకేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెండి డిసౌజ
హైదరాబాద్: ఐర్లాండ్ దేశంలో విద్యకోసం వెళ్తున్న విద్యార్థులు ఆ దేశ నియమ నిబంధనల ప్రకారం లీగల్‌గానే పార్ట్‌టైం ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఐర్లాండ్ దేశ ఎడ్యుకేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెండి డిసౌజ అన్నారు.
ఐ 20 ఫివర్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఐర్లాండ్‌లోని వివిధ యూనివర్సిటీలలో విద్యనభ్యసించేందుకు వెళ్తున్న విద్యార్థుల అవగాహన సదస్సు మంగళవారం జరగగా ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అక్కడి పరిస్థితులపై, పలు విషయాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యను పూర్తిచేసిన తర్వాత ఉద్యోగం వెతుక్కవడానికి రెండు సంవత్సరాల వరకు అక్కడే ఉండేందుకు అక్కడి చట్టం అనుమతిస్తుందని తెలిపారు.
ప్రతీయేటా తెలుగు రాష్ట్రాల నుంచి ఐర్లాండ్‌లో బిజినెస్ స్టడీస్, ఇంజనీరింగ్, ఫార్మాసూటికల్, హెల్త్‌కేర్ రంగాల్లో చదువుకోవడానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డబ్లిన్ సిటీ యూనివర్సిటీ, మేనూత్ టీయూఎస్ ఎన్‌సీఐ గ్రిఫిట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ గాల్వే ప్రతినిధులు హాజరయ్యారు. ఐ20 ఫివర్ సంస్థ ప్రతినిధులు నవీన్ యాతపు, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.