ఈనాడు కథనంపై కేటీఆర్ సీరియస్‌‌ | KTR Issues Legal Notice to Eenadu, Seeks Apology Over Passport Report | Sakshi
Sakshi News home page

ఈనాడు కథనంపై కేటీఆర్ సీరియస్‌‌.. లీగల్‌ నోటీసులు!

Oct 6 2026 11:44 AM | Updated on Oct 6 2026 11:54 AM

KTR Issues Legal Notice to Eenadu, Seeks Apology Over Passport Report

సాక్షి, హైదరాబాద్‌: ఈనాడు పత్రికలో తన పేరిట ప్రచురితమైన కథనంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు, నిరాధార సమాచారాన్ని ప్రచురించి పరువుకు భంగం కలిగించారని పేర్కొంటూ  లీగల్‌ నోటీసులు జారీ చేశారు. తక్షణమే ఆ వార్తను తొలగించి.. క్షమాపణ చెప్పాలని ఆ నోటీసుల్లో హెచ్చరించారాయన.  

కేటీఆర్‌ పాస్‌పోర్ట్‌ జప్తు కోసం ఏసీబీ కోర్టు నుంచి ఆదేశాలు జారీ అయ్యాయంటూ ఈనాడు సహా పలు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ వాటిని తొలగించాలని కేటీఆర్‌ తరఫు న్యాయవాది ఇంతకు ముందే కోరారు. అయితే సరైన స్పందన లేకపోవడంతో ఇప్పుడు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. 

పాస్‌పోర్ట్‌ జప్తు విషయంలో ఏసీబీ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తాజా నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. 48 గంటల్లోగా వార్తను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.

అసలు ఏం జరిగింది?
ఫార్ములా ఈ-కార్‌ రేసు కేసులో కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టును ఏసీబీ ఆశ్రయించింది. అయితే పాస్‌పోర్టును ప్రొటెక్ట్‌ చేయాలని మాత్రమే ఏసీబీ అధికారులు కోరగా.. కోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏసీబీ కేవలం పాస్‌పోర్టు ఇంపౌండ్‌ చేయాలని కోరుతూ మెమో దాఖలు చేయగా.. ఈలోపే పాస్‌పోర్టు జప్తు అంటూ అత్యుత్సాహంతో కథనాలు వెలువడ్డాయి. 

ఇదీ చదవండి: డిక్కీలో డబ్బులు పెట్టి పోండి సర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement