ఆనందయ్య మందు నేనూ ఇస్తా.. యువకుడి పోస్ట్‌

I Will Give Anandaiah Medicine, Nalgonda Man Post In Social media - Sakshi

సోషల్‌ మీడియాలో యవకుడి పోస్ట్‌

ఫోన్లు చేసిన బాధితులు

స్విచ్‌ఆఫ్‌ చేసుకున్న ఆకతాయి

పోలీసుల ఆరా?

సాక్షి, మిర్యాలగూడ : కరోనాకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు తాను ఇస్తానని ఓ ఆకతాయి సోషల్‌ మీడియా గ్రూప్‌ల్లో చేసిన ప్రచారం హల్‌చల్‌ చేసింది. గురువారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని బాల్నెపల్లికి చెందిన ఆకతాయి కుర్ర రమేష్‌ తాను కరోనాకు ఆనందయ్య తరహా ఆయుర్వేద మందు ఇస్తానని వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియాల్లో పోస్టులు పెట్టాడు. ఆ పోస్టు వైరల్‌ అయ్యింది.

దీంతో వివిధ ప్రాంతాల నుంచి కరోనా బాధితులు, వారి బంధువులు రమేష్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. అయితే ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వారు సైతం రమేష్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేదు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించేందుకు రమేష్‌ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామి ఎస్‌ఐ వీరశేఖర్‌ తెలిపారు. 

చదవండి: నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top