నకిలీ ‘ఆనందయ్య’ మందు స్వాధీనం: నిందితుడి అరెస్ట్‌

Some people made fake medicine in the name of Anandaiah - Sakshi

ముత్తుకూరు: కరోనా నివారణకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన మందును ఆయుష్‌ అధ్యయనం నేపథ్యంలో నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అదునుగా ఆనందయ్య శిష్యులుగా చెప్పుకునే కొందరు నకిలీ మందు తయారు చేసి వేలాది రూపాయలకు అమ్ముకుంటున్నారు.

తోటపల్లిగూడూరు మండలం కుమ్మరమిట్టకు చెందిన యడవల్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నకిలీ ఆయుర్వేద మందు తయారు చేస్తున్నట్టు నెల్లూరు రూరల్‌ డీఎస్పీ హరనాథరెడ్డి, కృష్ణపట్నం సీఐ షేక్‌ఖాజావలి చెప్పారు. ముత్తుకూరులోని సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. నిందితుడు గతంలో ఆనందయ్య వద్ద మందు తెచ్చుకున్నాడని, సరిగ్గా అలాంటి మందు తయారు చేసి పంపిణీ చేయడం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. నిందితుడితో పాటు నకిలీ మందును స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top