125 Feet Tall Ambedkar Statue In Hyderabad, Know About Interesting Facts In Telugu - Sakshi
Sakshi News home page

Ambedkar Tall Statue Facts: హైదరాబాద్‌లో ఆకాశమంత అంబేడ్కరుడు.. విగ్రహం విశేషాలు ఇవే!

Apr 14 2023 11:26 AM | Updated on Apr 14 2023 2:56 PM

Hyderabad: Tall Ambedkar Statue Of 125 Feet, Interesting Facts To Know - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ తీరాన సగర్వంగా కొలువైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా పేరు దక్కించుకుంది. ఈ విగ్రహాన్ని రాష్ట్ర సెక్రటేరియట్ పక్కన, బుద్ధ విగ్రహానికి సమీపంలో తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పక్కన ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 14న (శుక్రవారం) సీఎం కేసీఆర్‌ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం విశేషాలపై ఓ లుక్కేద్దాం!

►తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్‌ విగ్రహాం నిర్మాణాన్ని చేపట్టింది. భారీ ఎత్తున రూపొందిన ఈ విగ్రహం బరువు 465 టన్నులు ఉంటుంది. దీని కోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు. విగ్రహం ఢిల్లీలో తయారు చేసి విడి భాగాలుగా తెచ్చి హైదరాబాద్‌లో అమర్చారు. పార్లమెంటు ఆకారంలో నిర్మించిన పీఠం లోపల సందర్శనాలయం ఉంటుంది. 

►విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్ వాడారు. విగ్రహం తయారీ కోసం 425 మంది శ్రామికులు పని చేశారు. ఇందులో 2 లిఫ్ల్‌లను ఏర్పాటు చేశారు. ( ఒక్కోదానిలో 15 మంది సామర్థ్యం)

►విగ్రహం ఏర్పాటు కోసం 11.7 ఎకరాలు, ప్రధాన, అనుబంధ భవనాలు కోసం 1.35 ఎకరాలు, చుట్టు పచ్చదనం కోసం  2.93 ఎకరాలు, చుట్టూ అభివృద్ధి చేసిన ప్రాంతం కోసం 1.23 ఎకరాలు, కామన్‌ పార్కింగ్‌ కొరకు  4.82 ఎకరాలను కేటాయించారు.

►ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు.

►11.04 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అందులో 2.93 ఎకరాల్లో థీమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. 

►అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి సాంకేతిక, తయారీ చర్యలను ఖరారు చేసేందుకు రెండేళ్లు పట్టింది.

►ఈ కార్యక్రమానికి పద్మభూషణ్ అవార్డు గ్రహీత, విగ్రహ శిల్పి 98 ఏళ్ల రామ్ వంజీ సుతార్‌ను ఆహ్వానించారు.

►అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35 వేల మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.

►750 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రజల రావాణా కోసం ఉపయోగించనున్నారు.

►ఈ కార్యక్రమం కోసం హాజరయ్యే ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, 1.50 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement