Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే? | Huge Devotees Rush At Tirumala Temple | Sakshi
Sakshi News home page

Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

Dec 29 2024 8:42 AM | Updated on Dec 29 2024 9:37 AM

Huge Devotees Rush At Tirumala Temple

తిరుమల: ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట MBC వరకు క్యూలైన్లలో  వేచి ఉన్న భక్తులు . టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఒక ప్రకటనలో వెల్లడించింది.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. శనివారం శ్రీవారిని 78,414 మంది భక్తులు దర్శించుకోగా, 26,100 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

శ్రీశైలం లోపెరిగిన భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూల వద్ద బారులు తీరారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. ఉచిత కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పా హారం, బిస్కెట్లు పంపిణీ చేశారు. కాగా భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.

Advertisement
 
Advertisement
Advertisement