హిజ్రాకి వేధింపులు.. యువకుడి ఇంటి ముందు ధర్నా | Hijra Protest At Mandamarri | Sakshi
Sakshi News home page

హిజ్రాకి వేధింపులు.. యువకుడి ఇంటి ముందు ధర్నా

Apr 20 2025 8:46 AM | Updated on Apr 20 2025 8:49 AM

Hijra Protest At Mandamarri

మంచిర్యాల: ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని  వేధిస్తున్నాడంటూ మందమర్రి మొదటి జోన్‌లో ఉండే అజయ్‌ అనే యువకుడి ఇంటి ఎదుట శనివారం హిజ్రాలు ఆందోళన చేపట్టారు. తనను గత కొంతకాలంగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడని, ఫొటోలు, వీడియోలు తీసి వేధింపులకు పాల్పడుతున్నాడని చందన అనే హిజ్రా వాపోయింది. వీడియో కాల్‌ చేసి డబ్బులు కావాలని అడుగుతున్నాడని, ఇవ్వకపోతే రైలు కిందపడి చనిపోతానంటూ బెదిరిస్తున్నాడని పేర్కొంది. అజయ్‌ను తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసినట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. 

ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
లక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్‌ గ్రామానికి చెందిన మద్దెల గంగన్నృలక్ష్మి దంపతుల కుమారుడు రామ్‌చరణ్‌ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్‌ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్‌డ్యామ్‌ వద్దకు వెళ్లి చూడగా రామ్‌చరణ్‌ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement