30న హైకోర్టుకు సెలవు 

high court declared holiday on november 30 in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈనెల 30న హైకోర్టుకు సెలవు ప్రకటిస్తూ శనివారం రిజిస్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతోపాటు జ్యుడీషియల్‌ అకాడమీ, లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ, లీగల్‌ సర్విసెస్‌ కమిటీ, మీడియేషన్‌ అండ్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌కు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు.

ఈ సెలవు నేపథ్యంలో డిసెంబర్‌ 16 (శనివారం)ను పనిదినంగా ప్రకటించారు. న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టుల సిబ్బందికి సమాచారం కోసం ప్రకటన విడుదల చేసినట్లు వెల్లడించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top