
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. వర్షాలు లేక రైతాంగం ఇప్పటికే తీవ్ర అవస్థలు పడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఎండలు, ఉక్కపోతతో సామాన్య ప్రజానీకం సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో..
రేపు(గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. అలాగే.. ఎల్లుండి మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్ష పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో పడొచ్చని హెచ్చరించింది.
రాజధాని హైదరాబాద్ నగరంలో ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రి తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 340 మండలాల్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జిల్లాలు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి
భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్
నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం
నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్
ఈదురుగాలులు: గంటకు 30–40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ప్రజలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని సూచన
చెట్లు విరిగిపడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు