తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు | Heavy rain forecast for Telugu states | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు

Jun 16 2026 8:06 AM | Updated on Jun 16 2026 11:05 AM

Heavy rain forecast for Telugu states

సాక్షి, విశాఖపట్నం/ హైదరాబాద్:వాతావరణ శాఖ తెలంగాణకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 24 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌తో సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో సైతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఎండలు సైతం తీవ్రంగా ఉండనున్నట్లు పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement