
నల్లగొండ, చౌటుప్పల్: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. స్వస్థలాలకు వెళ్లేవారితో బస్టాండ్లు, రహదారులు కిక్కిరిసిపోయాయి. నల్లగొండ బస్టాండ్‌లో బస్సులు సరిపోక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి నిలబడి బస్సుల కోసం ఎదురు చూశారు. కిక్కిరిసిన బస్సుల్లో వెళ్లేందుకు నానా తంటాలు పడ్డారు.
చిన్నారులను బస్సు కిటికీ ల్లోంచి లోపలికి ఎక్కించాల్సి వచ్చింది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం విపరీతమైన రద్దీ నెలకొంది. ప్రధానంగా విజయవాడ మార్గంలో.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు భారీగా వాహనాల రద్దీ నెలకొంది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జనం నానా తిప్పలు పడ్డారు. ప్రధానంగా జంక్షన్ వద్ద రోడ్డును దాటేందుకు సాహసాలు చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ క్రమబదీ్ధకరణకు పోలీసులు భారీగానే మోహరించారు.