హెడ్‌కానిస్టేబుల్‌ కూతురుకు అరుదైన గౌరవం  | Head Constable Daughter Trisha Taken Prestigious Award By Narendra Modi | Sakshi
Sakshi News home page

హెడ్‌కానిస్టేబుల్‌ కూతురుకు అరుదైన గౌరవం 

Jan 30 2021 8:34 AM | Updated on Jan 30 2021 10:49 AM

Head Constable Daughter Trisha Taken Prestigious Award By Narendra Modi - Sakshi

సాక్షి,  రాయదుర్గం: కొండాపూర్‌లోని టీఎస్‌ఎస్‌పీ 8వ బెటాలియన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ లింగంగారి జనార్దన్‌ కూతురు లింగంగారి త్రిషకు అరుదైన గౌరవం లభించింది. దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న 17 రాష్ట్రాల ఎన్‌సీసీ కాడెట్స్‌ నుంచి బ్యానర్‌ ఆఫ్‌ ఆలిండియా బెస్ట్‌ డైరెక్టర్‌గా ఎంపికైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌కు దేశ ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా ఆర్‌డీ బ్యానర్, బెస్ట్‌ పీఎం ర్యాలీ ట్రోఫీని డీడీజీ ఎయిర్‌ కమెడోర్‌ కృష్ణణ్, సీనియర్‌ వింగ్‌ ఆర్మీ సీనియర్‌ అండర్‌ ఆఫీసర్‌ లింగంగారి త్రిష అందుకున్నారు.

ఆమె ఎన్‌సీసీ బెటాలియన్‌ 7(టి) బాలిక విభాగం సెయింట్‌ మార్టిన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నుంచి పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాలు ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం. అద్భుత ప్రతిభ చాటిన విద్యార్థి మియాపూర్‌లోని సెయింట్‌ మార్టిన్స్‌ కళాశాల చైర్మన్‌ జైకిషన్, ఉపాధ్యాయులు అభినందించారు. అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయిలో ట్రోఫీని ప్రధాని చేతులమీదుగా పొందడం గర్వంగా ఉందన్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement