సిద్ధార్థ సుభాష్‌చంద్రబోస్ భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ప్రజాస్వామికవాదులు
హైదరాబాద్: తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సిద్ధార్థ సుభాష్ చంద్రబోష్ (54) మాదాపూర్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్ర పొందుతూ సోమవారం సాయంత్రం మృతిచెందారు. ప్రస్తుత నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఆయన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్‌గా పేరొందారు. వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. 14 నెలల క్రితం అమరావతి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు.. సిద్ధార్థను ఏపీలోని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
అయినా, వెనక్కితగ్గకుండా ఫేష్‌బుక్‌లో రచనలు కొనసాగించారు. ఇటీవల అనారోగ్యానికి గురై పరీక్షలు చేయించుకోగా... కేన్సర్ నిర్ధారణ అయ్యింది. రెండ్రోజుల క్రితం చైనా వెళ్లేందుకు ప్రయత్నించగా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ వైద్య పరీక్షల్లో ప్రయాణ తిరస్కరణకు గురయ్యారు. సోమవారం ఊపిరి కష్టంగా మారడంతో ఆస్పత్రిలో చేర్చారు. సుభాష్ చంద్రబోష్ భౌతిక కాయాన్ని ప్రజాస్వామిక, వామపక్షవాదులు, ప్రజాసంఘాల ప్రతినిధుల సందర్శనార్థం విద్యానగర్‌లోని మార్క్ష్ భవన్‌లో ఉంచారు. అనతరం ఆళ్లగడ్డ తరలించారు. సుభాష్‌చంద్రబోష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.


