Tank Bund: చల్‌ మోహన రంగ | Great Places to Go Near Tankbund Garden Area | Sakshi
Sakshi News home page

Tank Bund: చల్‌ మోహన రంగ

Published Mon, Jun 24 2024 9:04 AM | Last Updated on Mon, Jun 24 2024 9:28 AM

Great Places to Go Near Tankbund Garden Area

సిడ్నీ, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని తలపించే ట్యాంక్‌ బండ్‌..
అద్భుత అందాలతో పాటు చారిత్రాత్మక వైభవాలకు ప్రతీక
నగరానికి మణిహారం సాగర తీరం..
చెప్పుకుంటూ పోతే మరెన్నో.. 

రింజిమ్‌..రింజిమ్‌..హైదరాబాద్‌..  రిక్షావాలా జిందాబాద్‌..  మూడు చక్రమలు గిరగిర తిరిగితే మోటరు కారు బలాదూర్‌.. అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు అటు చూస్తే చారి్మనారు.. ఇటు చూస్తే జుమ్మా మసీదు ఆ వంకా అసెంబ్లీ హాలు.. ఈ వంకా జూబిలి హాలూ తళతళ మెరిసే హుస్సేనుసాగరు.. దాటితే సికింద్రబాదూ...

ఇలా చెప్పుకుంటూ పోతే.. పర్యాటక ప్రాంతాలకు కొదవేలేదు.. ఎటుచూసినా ఏదో ఒక విశేషమైన ప్రాంతం చూపరులను అబ్బురపరుసూనే ఉంటాయి... వాటిల్లో ముఖ్య ఆకర్షణగా నిలిచేది.. ట్యాంక్‌ బండ్‌.. నగరాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ ట్యాంక్‌ బండ్‌తో అవినాభావ సంబంధం ఉంటుంది. ట్యాంక్‌ బండ్‌ ప్రారంభంలోనే ‘నగర రెజిమెంట్‌కు చెందిన ఆర్మీ జవాన్ల పోరాట స్ఫూర్తికి నిదర్శనం’గా ఏర్పాటు చేసిన యుద్ధనౌక స్వాగతం పలుకగా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పార్క్‌ అందాలు, మహనీయుల విగ్రహాల పలకరింపుతో సాగర్‌లోని నీటి ఫౌంటేన్ల తుంపరల మధ్య శాంతిమయుడు గౌతమ బుద్ధుడిని తిలకిస్తూ అక్కడి అందాలను ఆస్వాదించడం భలే అనుభూతిని కలిగిస్తుంది. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల గురించి లుసుకుందాం...  


సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర చరిత్రకు తలమానికమైన చారి్మనార్, గోల్కొండ కోట వంటి ప్రాంతాలే కాకుండా..దేశానికే తలమానికంగా నిరి్మతమైన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పార్లమెంట్‌ను పోలిన నిర్మాణం పైన భారీ ఎత్తులో నిరి్మతమైన ఈ విగ్రహం ట్యాంక్‌ బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తిలకించినా సగర్వంగా కనిపిస్తుంది. బుద్ధుడిని స్పూర్తిగా తీసుకుని దేశం గరి్వంచదగ్గ వ్యక్తిగా ఎదిగిన అంబేద్కర్‌., హుస్సేన్‌ సాగర్‌లోని బుద్ధుని వెనుకనే నిరి్మంచడంతో సింబాలిక్‌గా నిలుస్తుంది. నగర వైభవాన్ని ప్రతిబింబించే నిర్మాణాలైన చారి్మనార్, అసెంబ్లీ భవనాల సరసన నిలిచేలా నూతనంగా నిర్మితమైన బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం, కేబుల్‌ బ్రిడ్జి వంటివి చూపు తిప్పుకోనివ్వవు అంటే అతిశయోక్తి కాదేమో..!  

ఎన్‌.టి.ఆర్‌ గార్డెన్‌... 
అరుదైన బొన్సాయ్‌ మొక్కలు, ఆరి్టఫీషి యల్‌ మర్రిచెట్టులోంచి రైలు ప్రయాణం, భయపెట్టించే హంటర్‌ హౌస్, అబ్బురపరిచే పూల వనాలు, వింటేజ్‌ కార్లలో స్నాక్స్, అత్యంత ఎత్తులో నెక్లెస్‌ రోడ్‌ అందాలను చూపించే జేయింట్‌ వీల్, అండర్‌ గ్రౌండ్‌లో ఆటలు, ఆకట్టుకునే బొమ్మలు, ఆశ్చర్యపరిచే ఎడారి మొక్కలు, కళ్లముందు మ్యాజిక్‌ చేసే త్రీడి షో.. వెరసి అందరినీ అలరించే ఎన్‌.టీ.ఆర్‌ గార్డెన్‌. ఇక్కడే దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ హీరో ఎన్‌.టీ.రామారావు సమాధిని సందర్శింవచ్చు.

ప్రసాద్‌ ఐమాక్స్‌.. 
సినిమా, షాపింగ్, గేమింగ్, ఈటింగ్‌ ఇలా అన్ని రకాల నగర జీవన శైలికి అద్దం పట్టే వేదిక ఐమాక్స్‌. ఇందులో సినిమా చూస్తే అదో క్రేజ్‌లా మారేంతలా గుర్తింపు పొందింది. కొత్త సినిమాల విడుదలతో ప్రతీ శుక్రవారం ఇక్కడ సెలబ్రిటీలు, మీడియా ఛానల్స్‌ ఇంటర్వ్యూలతో సందడిగా ఉంటుంది.  

జల్‌ విహార్‌... 
కేవలం నీళ్లలో ఆడే ఆటలతో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ అలరిస్తుంది నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్‌. రేయిన్‌ డ్యాన్స్, వాటర్‌ఫూల్స్‌లో ఎత్తునుంచి జారవిడిచే ఆటలతో పాటు ఇతర వాటర్‌ గేమ్స్‌ ప్రేక్షకులను బయటకు రానివ్వవు.

థ్రిల్‌ సిటీ... 
ఈ మధ్యనే ప్రారంభమైన థ్రిల్‌ సిటీ ప్రమాదకరమైన ఆటలతో భయానకమైన వాతావరణంతో థ్రిల్లింగ్‌ అనుభూతిని పంచుతుంది. రోమాలను నిక్కబొడుచుకునేలా చేసే థ్రిల్లింగ్‌ గేమ్స్‌ విశేషంగా ఆకట్టుకుంటాయి.

పీవీ జ్ఞాన భూమి... 
ఇంతకు ముందు ఎరుగని ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు సమాధి ఈ జ్ఞాన భూమిలో కొలువుదీరింది. దేశానికి పనిచేసిన ఏ ప్రధాన మంత్రి సమాధిని చూడాలన్నా ఢిల్లీ వెళ్లాల్సిందే. కానీ దక్షిణాది ప్రధానిగా చక్రంతిప్పిన పీవీ సమాధి మాత్రం నెక్లెస్‌ రోడ్‌లో చూడవచ్చు.

సంజీవయ్య పార్క్‌... 
అనేక రంగులతో అలరించే రోస్‌ గార్డెన్, రంగురంగుల సీతాకోకచిలుకలను కలుసుకునే బటర్‌ఫ్లవర్‌ పార్క్, ఎత్తులో దేశంలో రెండో అతిపెద్ద జాతీయ జెండాలను ప్రత్యక్షంగా చూడాలంటే సంజీవయ్య పార్క్‌ వెళ్లాల్సిందే. ఎత్తులో రెండో స్థానం అయినప్పటికీ త్రివర్ణ పతాకం సైజులో మాత్రం దేశంలోనే అతిపెద్దది.

ఈట్‌ స్ట్రీట్‌–ఆర్ట్‌ స్ట్రీట్‌.. 
ఆహార ప్రియులకు అనువైన చోటు నెక్లెస్‌ రోడ్‌లోని ఈట్‌ స్ట్రీట్‌., సాగర్‌ నీటి అలల అంచున కూర్చోని వివిధ డిష్‌లను ఆస్వాదించవచ్చు. దీని ఎదురుగానే ఉన్న వీధుల్లోని ఇళ్లను మొత్తం విభిన్న చిత్రాలతో కళాకారులు తయారు చేశారు.  

డాగ్‌ పార్క్‌.. 
ప్రతీ ఆదివారం ఉదయం నగరంలోని అన్ని రకాల కుక్కలతో వారి యజమానులు ఈ డాగ్‌ పార్క్‌కు వస్తారు. జంతు ప్రేమికులను ఇది విశేషంగా అలరిస్తుంది.  

సైక్లింగ్‌ క్లబ్‌.. 
థ్రిల్‌ సిటీకి ఎదురుగా ఉన్న సైక్లింగ్‌ క్లబ్‌ ఫిట్‌నెస్‌కు మంచి మార్గం. ఇందులో మొంబర్‌íÙప్‌ తీసుకుని ఎవరైనా సైక్లింగ్‌ చేయవచ్చు.

అమరవీరుల స్మారక కేంద్రం... 
తెలంగాణ అమరవీరుల త్యాగాలకు శాశ్వత శ్రద్ధాంజలిగా దీపం రూపంలో నిరి్మంచిన స్మారక కేంద్రం కొత్త శోభను తీసుకొచి్చంది. ఇందులో ప్రత్యేకంగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేయడం అదనపు ఆకర్షణ.

టూరిస్టు సర్కిల్‌గా ట్యాంక్‌బండ్‌
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని గుర్తుచేసేలా సాగర్‌ మధ్యలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహం నగరానికే తలమానికం. చూట్టూ ఆవరించి ఉన్న నీటి మధ్యలో ఈ బుద్ధ విగ్రహాన్ని చూడటం అద్భుతమైన అనుభూతి. ఇక్కడి బోటింగ్‌ సదుపాయాలు అదనపు ఆనందం.

బిర్లా ప్లానిటోరియం.. 
విజా్ఞనం, వినూత్నం, వివేకానికి బిర్లా ప్లానిటోరియం మంచి వేదిక. విద్యార్థుల నుంచి పరిశోధకుల వరకూ అవసరమైన శాస్త్ర–సాంకేతిక, పురాతత్వ విషయాలను తెలుసుకొవచ్చు. ఇక్కడే అంతరిక్షానికి చెందిన ప్రత్యేక స్కై షో కూడా చూడవచ్చు.  

లుంబినీ పార్క్, బోటింగ్‌.. 
ఆటవిడుపుకు, కాలక్షేపానికి అడ్డాగా మాత్రమే కాకుండా హుస్సేన్‌సాగర్‌ అందాలను తనివితీరా చూపించే బోటింగ్‌ సదుపాయం లుంబినీ పార్క్‌ సొంతం. సాధారణ బోటింగ్, సినిమాల్లో చూపించే వేగంగా ప్రయాణించే స్పీడ్‌ బోట్లతో పాటు వ్యక్తిగత పారీ్టలు సైతం నిర్వహించుకునేలా లగ్జరీ బోట్లు అందుబాటులో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement