తెలంగాణ సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత | Fee Reimbursement: Bc Groups Besiege Telangana Secretariat | Sakshi
Sakshi News home page

తెలంగాణ సచివాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత

Jun 18 2026 4:23 PM | Updated on Jun 18 2026 4:46 PM

Fee Reimbursement: Bc Groups Besiege Telangana Secretariat

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం సచివాలయాన్ని బీసీ సంఘాలు ముట్టడించాయి. నాలుగు దఫాలుగా సచివాలయం ముట్టడికి బీసీ నేతలు ప్రయత్నించారు. ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. బీసీ సంఘాల నేతలను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని చేయాలని బీసీ సంఘాలు డిమాండ్‌ చేశాయి. బీసీ నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, విక్రమ్ గౌడ్, కనకల శ్యామ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు. గత నాలుగు ఏళ్లుగా ఫీజుల బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తుందని.. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని బీసీ నేతలు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement