పిల్లలను చూడనివ్వడం లేదని.. తండ్రి సెల్ఫీ సూసైడ్‌! | Father Commits Suicide While Recording A Selfie Alleging He Was Not Allowed To See His Children | Sakshi
Sakshi News home page

పిల్లలను చూడనివ్వడం లేదని.. తండ్రి సెల్ఫీ సూసైడ్‌!

Jun 16 2026 9:04 AM | Updated on Jun 16 2026 9:04 AM

Father Commits Suicide While Recording A Selfie Alleging He Was Not Allowed To See His Children

కంటోన్మెంట్‌: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్‌పల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఓల్డ్‌ బోయిన్‌పల్లి ఘోరీ నగర్‌కు చెందిన గయాజుద్దీన్‌ ఘోరీ (30) రెండేళ్ల క్రితం వరకు ఓ కిరాణాషాపు నిర్వహించాడు. ఆ తరువాత నుంచీ ఖాళీగా ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు భార్యతో గొడవలు మొదలయ్యారు.

ఈ క్రమంలో భార్య పిల్లలను తీసుకుని ఉప్పుగూడలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. భార్య, భర్తల నడుమ విభేదాలు ముదరడంతో కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారు. తన పిల్లలను చూసేందుకు కూడా భార్య అనుమతించడం లేదంటూ గయాజుద్దీన్‌ కుటుంబసభ్యులతో వాపోయాడు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున  ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. గయాజుద్దీన్‌ సోదరుడు రియాజుద్దీన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement