ఫిబ్రవరి 7న కీలక ప్రకటన: మంత్రి శ్రీధర్‌బాబు | Duddilla Sridhar Babu Chit Chat With Media | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 7న కీలక ప్రకటన: మంత్రి శ్రీధర్‌బాబు

Jan 28 2025 8:09 PM | Updated on Jan 28 2025 8:19 PM

Duddilla Sridhar Babu Chit Chat With Media

సాక్షి,హైదరాబాద్‌ : ఫిబ్రవరి 7న ఉద్యోగాల అంశంలో కీలక ప్రకటన ఉండబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు (Sridhar Babu) అన్నారు. దావోస్‌ పర్యటన విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల కాలంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది వచ్చాయి. ఈ పెట్టుబడులను గ్రౌండ్ చేయడానికి ఇప్పటికే వర్క్ మొదలు పెట్టాం. రాబోయే ఏడాదిపై మా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. భవిషత్ అంతా ఏఐ, సైబర్ సెక్యూరిటీ పైనే .. దానిపై మేము ఫోకస్ పెట్టాం.

గత బీఆర్‌ఎస్‌ ఐటీ పాలసీని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఐటీ పాలసీ తెస్తాం. ట్రిపుల్ ఆర్ చుట్టూ ఐటీ విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ ఐటీ అభివృద్ధి చేయబోతున్నాం. ఔట్ లుక్స్ మాల్స్ తరహాలో హైదరాబాద్ చుట్టూ మాల్స్ తెచ్చే యోచనలో సర్కార్ ఉంది.

ఫిబ్రవరి 7వ ఉద్యోగాల అంశంలో కీలక ప్రకటన ఉండబోతోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన సర్కార్‌కు లేదు. మంత్రులు ఎవరూ అలక.. అసంతృప్తిలో లేరు. ఆర్థిక పరిస్థితి పై అందరికీ అవగాహన ఉంది. అవినీతి ఆరోపణలు కరెక్ట్ కాదు. ఖండిస్తున్నాం. గచ్చిబౌలి అవతార్ టవర్స్ తరహాలో హకింపేట్‌లో   రాబోతున్నాయి. గత ప్రభుత్వం లెక్క భవనాలు చూపించి అభివృద్ధి అనం...అసలైన అభివృద్ధి ఏంటో రాబోయే ఐదేళ్లలో చూపిస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement