పోక్సో కేసులో 76 ఏళ్ల డాక్టర్‌కు ఏడేళ్ల జైలు | doctor sentenced 7 years for misconduct with minor in kukatpally | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో 76 ఏళ్ల డాక్టర్‌కు ఏడేళ్ల జైలు

Apr 11 2026 9:58 AM | Updated on Apr 11 2026 1:06 PM

doctor sentenced 7 years for misconduct with minor in kukatpally

కేపీహెచ్‌బీకాలనీ: బాలికతో  అనుచితంగా  ప్రవర్తించిన ఓ డాక్టర్‌కు కూకట్‌పల్లి ఫాస్ట్‌ ట్రాక్‌ పోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలిపిన మేరకు.. 2023లో ఓ  బాలికతో ఆదిత్యనగర్‌కు చెందిన డాక్టర్‌ కందుల సుబ్బారావు (76) అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సుబ్బారావుకు ఏడేళ్ల ఏళ్ల జైలు శిక్ష, 30 వేల రూపాయల జరిమానా విధిస్తూ కూకట్‌పల్లి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వరరావు తీర్పు వెలువరించారు. తీర్పు అనంతరం డాక్టర్‌ సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement