నేటి నుంచి ట్రాఫిక్‌ మళ్లింపులు.. మార్గాలు ఇవే | Traffic diversions key announcement | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ట్రాఫిక్‌ మళ్లింపులు.. మార్గాలు ఇవే

Apr 10 2026 9:22 PM | Updated on Apr 10 2026 9:23 PM

Traffic diversions key announcement

సాక్షి, హైదరాబాద్: మెహిదీపట్నం రైతుబజార్, బస్‌స్టాప్‌ జరుగుతున్న స్కైవాక్ నిర్మాణ పనుల దృష్ట్యా, ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఈ రోజు (శుక్రవారం) రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఈ క్రింది విధంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని అధికారులు ట్రఫిక్‌ అడ్వయిజరీ జారీ చేశారు..

ట్రాఫిక్ మళ్లింపులు జరిగే ప్రాంతం

మాసబ్ ట్యాంక్, NMDC, ఎస్.డి.ఐ హాస్పిటల్ వైపు నుండి రేతిబౌలి-నానల్ నగర్ వైపు వెళ్లే వాహనాలను పి.వి.ఎన్.ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం. 2 & 3 (అజీజియా మసీదు) వద్ద మళ్లిస్తారు.ఈ వాహనాలు మెరాజ్ కేఫ్ వద్ద కుడి వైపుకు తిరిగి, మెహిదీపట్నం పిల్లర్ నెం. 15 వద్ద తిరిగి ప్రధాన మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా నగర ప్రయాణీకులు ఎప్పటికప్పుడు తాజా ట్రాఫిక్ అప్‌డేట్ల కోసం మా సోషల్ మీడియా వేదికలైన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్‌బుక్ పేజీ (facebook.com/ HYDTP) ఎక్స్‌ట్విట్టర్ హ్యాండిల్ @HYDTP ను అనుసరించాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితిల్లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్  నెంబర్: 9010203626 కాల్‌చేయాలని హైదరాబాద్‌ జాయింట్ కమిషనర్‌  జోయల్ డేవిస్ ప్రకటన విడుదల చేశారు

Advertisement
 
Advertisement
Advertisement