హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిరుద్యోగుల నుంచి రూ. 5 కోట్లు మేర వసూలు చేసింది ఓ గ్యాంగ్, అయితే ఎంతకీ ఉద్యోగాల మాట ఎత్తకపోవడంతో వారిని నిలదీశారు బాధితులు.
ఈ విషయాన్ని నాన్చడంతో అనుమానం వచ్చిన బాధితులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 452 మంది బాధితులు పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.


