బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్‌ | Jeevan Reddy To Join BRS On April 20th | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరికకు ముహూర్తం ఫిక్స్‌

Apr 10 2026 7:28 PM | Updated on Apr 10 2026 7:48 PM

Jeevan Reddy To Join BRS On April 20th

సిద్ధిపేట:  ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 20వ తేదీన బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరనున్నారు. దీనిలో భాగంగా జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలోనే జీవన్‌రెడ్డి.. గులాబీ కండువా కప్పుకోనున్నారు. 

ఈరోజు( శుక్రవారం, ఏప్రిల్‌ 10వ తేదీ) సిద్దిపేట జిల్లాలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి సమావేశమయ్యారు.  ఎర్రవెల్లిలో సుమారు ఐదు గంటల పాటు కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో జీవన్‌రెడ్డి చేరికపై స్పష్టత నిచ్చారు. 

దీనిలో భాగంగా జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునే వారు. కానీ ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోంది. త్వరలోనే జగిత్యాలలో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతా. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తుంది. 

నాకు 14 సార్లు B ఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతోనే ఇచ్చారు. నేను కంటెంట్ ఉన్న నాయకున్నీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో పయనిస్తుంది. కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది.  మిగిలిన రెండున్నరేళ్లు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పని చేయాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement