హైదరాబాద్: డీలిమిటేషన్ పై సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరాలేంటని ప్రశ్నించారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి. యూపీఏ హయాంలో పునర్విభజన చేస్తే తప్పు కాదు,, తాము చేస్తే తప్పా?, SIR ప్రక్రియ గతంలో వాళ్ళు చేస్తే తప్పు కాదు.. తాము చేస్తే తప్పా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.
‘మూసీ ప్రక్షాళన కోసం రంలో ట్రీట్ మెంట్ ప్లాంట్‌లకి కేంద్రం నిధులు ఇస్తుంది. రాష్ట్రం అడిగిన రుణాలను ఇతర సంస్థల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. మూసీ ప్రక్షాళన చేయండి. మూసీ డెవలప్‌మెంట్ చేయండి. కానీ పేదల ఇళ్లను కూల్చొద్దు. డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి అభ్యంతరాలు ఎంటి..?, వాళ్ళకి ఎం కావాలో పార్లమెంట్ లో వాళ్ళ ఎంపీలను మాట్లాడమనండి.
చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్లను అమలు చేయబోతున్నాం. నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయలేం. ఏది పెట్టిన కావాలని వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ కోడి గుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తుంది. ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డీలిమిటేషన్ జరుగుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.


