త్వరలో తెలంగాణ లిక్కర్‌ చార్జీలు పెంపు..! | Telangana Liquor Prices Set to Rise Soon | Sakshi
Sakshi News home page

త్వరలో తెలంగాణ లిక్కర్‌ చార్జీలు పెంపు..!

Apr 10 2026 8:40 PM | Updated on Apr 10 2026 8:40 PM

Telangana Liquor Prices Set to Rise Soon

హైదరాబాద్‌:  తెలంగాణలో లిక్కర్‌ చార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. త్వరలో రాష్ట్రంలో లిక్కర్‌ చార్జీలు పెరుగనున్నాయి. ఈ నెలాఖరుకల్లా చార్జీల పెంపుపై నిర్ణయం కమిటీ నిర్ణయం తీసుకోనుంది. లిక్కర్‌ చార్జీల పెంపును 12 నుంచి 15 శాతం వరకూ పెంచాలని కంపెనీల ప్రతిపాదనలు పంపగా, దానిపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది. 

ఇప్పటికే  బీర్ల ధరలను ప్రభుత్వం పెంచగా, మళ్లీ లిక్కర్‌ ధరలను పెంచాలని భావిస్తోంది. రెండేళ్లకొకసారి లిక్కర్‌ ధరలను పెంచే నిబంధన ఉందని అధికారులు అంటుండగా, లిక్కర్‌ ధరలు పెరిగి దాదాపు మూడేళ్లు అవుతుందని ప్రభుత్వం అంటోంది. దాంతో లిక్కర్‌ ధరల పెంపునకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైందనే విషయం అర్ధమవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement