బిగ్‌ ప్లాన్‌: 2,000 మందితో.. హైడ్రా కూల్చివేతలు | HYDRAA Huge Operation At Ameenpur | Sakshi
Sakshi News home page

బిగ్‌ ప్లాన్‌: 2,000 మందితో.. హైడ్రా కూల్చివేతలు

Apr 11 2026 9:11 AM | Updated on Apr 11 2026 10:14 AM

HYDRAA Huge Operation At Ameenpur

సాక్షి, సంగారెడ్డి: అమీన్‌పూర్‌ మండలంలో హైడ్రా, రెవెన్యూ శాఖతో కలిసి భారీ ఆపరేషన్‌కు దిగింది.  అక్రమ కట్టడాల కూల్చివేత కోసం భారీ వాహనాలు, సుమారు 2,000 మంది సిబ్బందితో రంగంలోకి దిగింది. నిజాం కాలం నాటి 1,260 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు గుర్తించడంతో చర్యలకు ఉపక్రమించింది. 

ఈ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. అయినా కూడా సుమారు 400 ఎకరాల్లో అక్రమంగా శాశ్వత నిర్మాణాలు వెలిశాయి. మిగిలిన 860 ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు హైడ్రా నిర్ధారించుకుంది. ఈ క్రమంలో.. 

శనివారం ఉదయం ఐలాపూర్ గ్రామంలో కబ్జాకు గురైన ప్రభుత్వ, ఇనాం భూములను స్వాధీనం చేసుకుంటోంది. గొడవ జరిగే పరిస్థితులు ఉండడంతో.. భారీగా పోలీసులను మోహరించారు.  

మరోవైపు.. కృష్ణారెడ్డి పేటలో క్రిస్టల్‌ డెవలర్ప్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్ద కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న 40 కుటుంబాలను ఖాళీ చేయిస్తున్నారు. ఇక్కడా ఘర్షణలు జరిగే అవకాశం ఉండడంతో సుమారు 1,000 మంది సిబ్బంది ఇక్కడ మోహరించినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement