డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం | Deputy CM Bhatti Vikramarka Brother Venkateswarlu Passed Away | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం

Published Tue, Feb 13 2024 11:35 AM | Last Updated on Tue, Feb 13 2024 11:49 AM

Deputy CM Bhatti Vikramarka Brother Venkateswarlu Died - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇంట విషాదం నెలకొన్నది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వరరావు(70) కన్నుమూశారు. ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.

వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని ఖమ్మం జిల్లా వైరాకు తరలిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సోదరుడి మరణవార్త తెలియగానే భట్టి విక్రమార్క తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి వైరాకు ఆయన వెళ్లనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement