వారం రోజులుగా ఇంట్లో శవం పెట్టుకొని... | Family Members Kept Woman Dead Body In Home For Three Days In Chintal - Sakshi
Sakshi News home page

వారం రోజులుగా ఇంట్లో శవం పెట్టుకొని...

Dec 20 2023 11:27 AM | Updated on Dec 21 2023 2:50 PM

 dead body three days home In Hyderabad - Sakshi

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో చనిపోయిన మహిళ మృతదేహం వారం రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు మృతదేహంకి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఓ ఇంట్లో మహిళ (40) చనిపోయి వారం రోజులు అయింది. కుళ్లిపోయి పురుగులు పట్టినా.. అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Advertisement
 
Advertisement
Advertisement