Gachibowli: నేను పోలీసును.. పైసా ఇవ్వను..! | నేను పోలీసును, డబ్బులు ఇవ్వను’ అంటూ గన్‌ చూపించినట్లు ఫుడ్‌ కోర్ట్‌ నిర్వాహకుడు మనీష్‌ 100కు కాల్‌ చేశాడు. వెంటనే గచ్చిబౌలి పెట్రోల్‌ మొబైల్‌ సిబ్బంది కానిస్టేబుల్‌ వివేక్‌ను పీఎస్‌కు తరలించారు. మొమోస్‌ తినక ముందే ధర విషయంలో వివాదం జరిగిందని, ఐడీ కార్డు లేకపోవడంతో గన్‌ చూపించాడని గచ్చిబౌలి పోలీసులు చెబుతుండటం గమనార్హం. | Sakshi
Sakshi News home page

Gachibowli: నేను పోలీసును.. పైసా ఇవ్వను..!

Jun 18 2026 10:02 AM | Updated on Jun 18 2026 11:04 AM

constable threatens food court staff with gun over momos bill in gachibowli

హైదరాబాద్‌  : నగర కమిషనరేట్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఫుడ్‌ కోర్టుకు వెళ్లి గన్‌తో బెదిరించి హల్‌చల్‌ సృష్టించాడు. బాధితుడి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. నగర కమిషనరేట్‌లోని యాంటీ స్నాచింగ్‌ టీమ్‌లో పని చేసే ఏఆర్‌ కానిస్టేబుల్‌ వివేక్‌ బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు డీఎల్‌ఎఫ్‌ సమీపంలోని మొమోస్‌ డిలైట్‌ ఫుడ్‌ కోర్ట్‌కు వెళ్లాడు. మొమోస్‌ తిన్న తర్వాత రూ.175 ఇవ్వమని అడగగా రేట్‌ ఎక్కువగా ఉందని కానిస్టేబుల్‌ గొడవకు దిగాడు.

 ‘నేను పోలీసును, డబ్బులు ఇవ్వను’ అంటూ గన్‌ చూపించినట్లు ఫుడ్‌ కోర్ట్‌ నిర్వాహకుడు మనీష్‌ 100కు కాల్‌ చేశాడు. వెంటనే  గచ్చిబౌలి పెట్రోల్‌ మొబైల్‌ సిబ్బంది కానిస్టేబుల్‌ వివేక్‌ను పీఎస్‌కు తరలించారు. మొమోస్‌ తినక ముందే ధర విషయంలో వివాదం జరిగిందని, ఐడీ కార్డు లేకపోవడంతో గన్‌ చూపించాడని  గచ్చిబౌలి పోలీసులు చెబుతుండటం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement