TG: రౌడీషీటర్‌ దాడిలో గాయపడ్డ కాంగ్రెస్‌ నేత మృతి | Congress leader Adupa Mahesh Attacked By Rowdy Sheeter: Dies | Sakshi
Sakshi News home page

TG: రౌడీషీటర్‌ దాడిలో గాయపడ్డ కాంగ్రెస్‌ నేత మృతి

Jul 19 2026 7:23 PM | Updated on Jul 19 2026 7:36 PM

Congress leader Adupa Mahesh Attacked By Rowdy Sheeter: Dies

వరంగల్‌: రౌడీషీటర్‌ దాడిలో గాయపడ్డా వరంగల్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఆడుప మహేష్‌ మృతిచెందారు. నిన్న(శనివారం, జూలై 18వ తేదీ) మహేష్‌పై రౌడీషీటర్‌ కుమార్‌తో పాటు పలువురు దాడికి పాల్పడ్డారు. మహేష్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అయితే తీవ్రంగా గాయపడ్డ మహేష్‌ను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అతన్ని హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. 

గత కొంతకాలంగా కాంగ్రెస్‌ నేత మహేష్‌తో రౌడీషీటర్‌ కుమార్‌ వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే శనివారం పలువురు వ్యక్తులతో కలిసి వచ్చిన రౌడీషీటర్‌ కుమార్‌.. మహేష్‌పై దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను మహేష్‌పై పోసి నిప్పంటించాడు. దాంతో తీవ్ర గాయాలు పాలైన మహేష్‌ను ఆపై ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే యత్నం చేశారు. అయితే  ఈరోజు పరిస్థితి మరింత విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించే యత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే మహేష్‌ మృతిచెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement