రుణమాఫీ-రేషన్‌కార్డ్‌ రూల్‌పై సీఎం రేవంత్‌ క్లారిటీ | CM Revanth Reddy Clarity On Ration Card Loan Waive Link | Sakshi
Sakshi News home page

రుణమాఫీ-రేషన్‌కార్డ్‌ రూల్‌పై సీఎం రేవంత్‌ క్లారిటీ.. ఈ నెల 18న రూ. లక్ష వరకు రుణమాఫీ

Jul 16 2024 5:07 PM | Updated on Jul 16 2024 5:21 PM

CM Revanth Reddy Clarity On Ration Card Loan Waive Link

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో రైతు రుణమాఫీకి రేషన్‌ కార్డు తప్పనిసరి అనే నిబంధనపై ముఖ్యమంత్రి  ఎనుముల  రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. కలెక్టర్లతో ఇవాళ సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమి పాస్‌ బుక్‌ల ఆధారంగానే కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్‌కార్డు నిబంధన అని తెలిపారు.

ఇదిలా ఉంటే.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ నెల 18న లక్ష రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజు సాయంత్రం లోగా రైతుల రుణఖాతాల్లో డబ్బులు జమ చేయాలని భావిస్తోంది. 

అదే రోజు.. రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులో సంబురాలు నిర్వహించాలని, వీటికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కావాలని సీఎం రేవంత్‌ సూచించారు. మరోవైపు.. రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమచేసుకుంటే బ్యాంకర్లపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement