మెట్రో ఫేజ్‌ -2 ను అడ్డుకుంటుంది కిషన్‌ రెడ్డే..? సీఎం రేవంత్ | CM Revanth Makes Sensational Comments On Hyderabad Metro Phase 2, Warns Of Alternative Plans If Centre Delays Loan | Sakshi
Sakshi News home page

మెట్రో ఫేజ్‌ -2 ను అడ్డుకుంటుంది కిషన్‌ రెడ్డే..? సీఎం రేవంత్

Jun 15 2026 1:59 PM | Updated on Jun 22 2026 9:36 PM

CM Revanth makes sensational comments on Hyderabad Metro

సాక్షి, హైదరాబాద్:  మెట్రో ఫేజ్‌-2 పనులను కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఉండాలా లేదా అని కిషన్‌ రెడ్డి  కేంద్రాన్ని  ప్రశ్నించడంతో  ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు ఆపేసిందన్నారు. ఈ రోజు (సోమవారం) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సాఆర్‌ హాయంలోనే  హైదరాబాద్‌లో మెట్రో రైలుకు టెండర్లు పిలిచారని రేవంత్ తెలిపారు. 

మెట్రోను ఆపడానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేటీఆర్‌ కుట్రలు చేస్తున్నారని మెట్రో ఫేజ్‌-2 పనులకు కిషన్‌ రెడ్డి సహకరిస్తే ఒక మెట్లో స్టేషన్‌కు ఆయన పేరు పెడతామని తెలిపారు. కిషన్ రెడ్డి పట్ల తనకు వ్యతిరేకత లేదని మెట్రో విషయంలో ఆయన ధైర్యంగా ఉంటే తాను అండగా ఉంటాను. మెట్రో విషయంలో కేంద్రం వెంటనే లోన్ రిలీజ్‌ చేయకపోతే ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తామన్నారు. కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రి కాబట్టి నిధుల అంశం ఆయనను అడుగుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. 

కేంద్రమంత్రులను వ్యక్తిగతంగా కలిసి పరిస్థితులు వివరించాను. మెట్రోకు నష్టాలు రాకుండా లాభాల కోసం రకరకాల సంస్థలను సంప్రదించామని. ఫేజ్-1 వరకూ యజమానులు మీరయితే ఫేజ్‌-2 అనుమతులు ఈజీగా వస్తాయని కేంద్రం చెప్పిందని అయినప్పటికీ నిధులు విడుదల చేయడం లేదన్నారు. 

మెట్రో ఫేజ్-2 షురూ చేస్తాం..

హైదరాబాద్‌ని విశ్వనగరమని చెప్పుకుంటుంన్నాం దానికి తగ్గట్లు అంతర్జాతీయ నగరానికి ఉండేలా సదుపాయలు కూడా ఉండాలి. ఫేజ్‌-2 అనుమతి కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాం మరో 122 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ జరగాలని కోరాం. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్‌కు రూ. 350 కోట్ల ఖర్చువుతుందని ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల కోటి 34 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement