
హైదరాబాద్: కళా తపస్వి కె. విశ్వనాథ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశ్వనాథ్ మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్...అరుదైన దర్శకుడు కె. విశ్వనాథ్ అని కొనియాడారు.
తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు విశ్వనాథ్ ఉంటారన్న సీఎం కేసీఆర్.. ఆయన తన సినిమాల్లో విలువలకు పెద్దపీట వేశారన్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సీఎం కేసీఆర్.