‘ఒక్కగానొక్కడు’ సీఎం కేసీఆర్‌ | CM KCR Book Okkaganokka Released By juluri Gowri Shankar In Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఒక్కగానొక్కడు’ సీఎం కేసీఆర్‌

Feb 14 2021 10:26 AM | Updated on Feb 14 2021 10:31 AM

CM KCR Book Okkaganokka Released By juluri Gowri Shankar In Hyderabad - Sakshi

కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మాట్లాడారు.

సాక్షి, హైదరాబాద్‌: నాడు, నేడు.. కేసీఆర్‌ తిరుగులేని నేత అని వక్తలు పేర్కొన్నారు. బీసీ కమిషన్‌ పూర్వసభ్యుడు జూలూరు గౌరీశంకర్‌ రచించిన ‘ఒక్కగానొక్కడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఇక్కడి మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో జరిగింది. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌కుమార్, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమకాలంలో, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, పాలనలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాత్ర మరవలేనిదని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, కాలె యాదయ్య, బీసీ కమిషన్‌ పూర్వ సభ్యులు ఈడిగ ఆంజనేయులు గౌడ్, రామానంద తీర్థ సంస్థ డైరెక్టర్‌ కిషోర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement