హైదరాబాద్: నగరంలో గ్యాస్ కష్టాలు సాధారణంగా మారాయి. హోటళ్లు, పీజీలు ఇప్పటికే మూతపడుతుండగా.. మరోవైపు సాధారణ ప్రజలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆన్‌లైన్ బుకింగ్‌లు కాకపోవడంతో చాలామంది గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి.
గృహిణులు అయితే చంటి పిల్లలతోనూ ఏజెన్సీల వద్దకు వస్తున్నారు. కాగా, హోటల్ నిర్వాహకులు కొందరు ఓపెన్ కిచెన్ లో వంట చేస్తున్నారు. సీఎన్‌జీతో నడిచే ఆటోలకూ కటకట ఏర్పడింది. దీంతో గ్యాస్ బంకుల వద్ద వాహనాలతో డ్రైవర్లు బారులు తీరుతున్నారు.


