చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా.. | Central Govt Employee Sexual harassment On minor girl | Sakshi
Sakshi News home page

చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళ్తుండగా..

Aug 19 2024 7:03 AM | Updated on Aug 19 2024 7:03 AM

Central Govt Employee Sexual harassment On minor girl

     చిన్నారిపై లైంగిక వేధింపులు  

    నిందితుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి

    కేసు నమోదులో పోలీసుల తాత్సారం 

    ఓ పోలీస్‌ అధికారి ఒత్తిడితో కేసు నమోదు 

సైదాబాద్‌: షాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతున్న మైనర్‌ బాలికను ఓ కామాంధుడు ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివరాలు... సైదాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఒక కాలనీలో నివసించే ఓ కుటుంబానికి చెందిన బాలిక(10) ఈ నెల 11న కిరాణషాపులో చాక్లెట్లు కొనుక్కొని ఇంటికి వెళుతోంది. బాలిక ఇంటికి సమీపంలో నివసించే ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి(58) ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. 

దాంతో భయపడిన బాలిక తప్పించుకొని ఏడుస్తూ ఇంటికి చేరుకుంది. ఏం జరిగిందని తల్లి అడగటంతో విషయం బయట పడింది. నెల రోజుల క్రితం కూడా ఇంటి వద్ద తాను ఆడుకుంటుండగా అతడు ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని తల్లికి చెప్పింది. వెంటనే బాలిక తల్లి అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఎదురుదాడి చేశాడు. ఈ ఘటనపై అదే రోజు సైదాబాద్‌ పోలీసులను బాలిక తల్లి ఆశ్రయించగా నిందితుడితో రాజీ చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. రెండురోజులపాటు పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరిగినా కేసు నమోదు కాలేదు. 

బాధితురాలి తండ్రి ఒక పోలీస్‌ ఉన్నతాధికారి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్నాడు. ఆయనకు విషయం చెప్పగా సైదాబాద్‌ పోలీసులకు ఫోన్‌ చేసినట్లు సమాచారం. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ నెల 13న నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడి భార్య, కూతురు తమను తిట్టారని, ఎక్కడికి వెళ్లి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండని బెదిరించారని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement