7 అడుగుల నాగు..17 ఏళ్ల వయసు | captured big cobra snake at wanaparthy | Sakshi
Sakshi News home page

7 అడుగుల నాగు..17 ఏళ్ల వయసు

Aug 3 2024 2:46 AM | Updated on Aug 3 2024 2:46 AM

captured big cobra snake at wanaparthy

వనపర్తిలో అతిపెద్ద నాగుపాము పట్టుకున్న ‘స్నేక్‌ సొసైటీ’

వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని చందాపూర్‌ రోడ్డు పీర్లగుట్ట సమీపంలోని ఓ ఇంట్లోకి అతి పెద్ద నాగుపాము వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమాని రాంబాబు బాత్‌రూంలోకి వెళుతుండగా.. బుసలు కొడుతున్న శబ్దం విని ఆగిపోయాడు. ఆ తర్వాత చూడగా పెద్ద నాగుపాము కనిపించింది. దీంతో భయపడిన రాంబాబు సాగర్‌ స్నేక్‌ సొసైటీ నిర్వాహకుడు చీర్ల కృష్ణసాగర్‌కు ఫోన్‌ చేశాడు.

వెంటనే ఆయన తన బృందంతో అక్కడకు చేరుకొని పామును పట్టుకున్నా డు. పాము పొడవు ఏడు అడుగులు ఉండగా, వయసు 16 నుంచి 17 ఏళ్లకు పైబడి ఉంటుందని కృష్ణసాగర్‌ చెప్పాడు. తాను ఇప్పటి వరకు 7,013 పాములు పట్టుకున్నానని, కానీ ఇంతపెద్ద నాగుపామును చూడటం ఇదే మొదటిసారి అని కృష్ణసాగర్‌ తెలిపాడు. ఈ విషయంపై వెటర్నరీ ఏడీ డాక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ పాము వయసు ఎక్కువే ఉండొచ్చని.. దాన్ని సమీపంలోని అడవిలో వదిలిపెట్టినట్టు  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement