బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు! | Bodrai Fest Established In Warangal District | Sakshi
Sakshi News home page

బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!

Apr 18 2022 4:04 AM | Updated on Apr 18 2022 10:53 AM

Bodrai Fest Established In Warangal District - Sakshi

మచ్చాపూర్‌లో ప్రతిష్టించిన బొడ్రాయి 

గీసుకొండ: వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్‌ గ్రామంలో నాలుగు రోజులుగా జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన, వనభోజనాల కార్యక్రమంలో ఏకంగా రూ.5 కోట్ల మేర ఖర్చయిందనే విషయం చర్చనీయాంశమైంది. గ్రామ సర్పంచ్‌ బోడకుంట్ల ప్రకాశ్‌ సర్పంచ్‌ ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సొంతంగా రూ.15 లక్షలు ఖర్చు చేశారని అంటున్నారు. అలాగే ప్రతీ ఇంటికి కొత్త బట్టలు, పూజ సామగ్రి, యాట పోతుల కొనుగోలు, వంటకాలు, బంధువులకు మర్యాదలు, భోజనాలు, విందు కోసం మందు, ఇలా ప్రతీ ఖర్చును లెక్కలోకి తీసుకుంటే సుమారు రూ. 5 కోట్ల మేర ఖర్చయిందని గ్రామస్తులు చెబుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement