ఓటర్ల వద్దకు బీఎల్‌ఓలు | BLOs reach voters for Distribution of enumeration forms begins | Sakshi
Sakshi News home page

ఓటర్ల వద్దకు బీఎల్‌ఓలు

Jun 26 2026 1:56 AM | Updated on Jun 26 2026 1:56 AM

BLOs reach voters for Distribution of enumeration forms begins

హైదరాబాద్‌ గన్‌¸ûండ్రీలో ఓటర్లకు ఎన్యూమరేషన్‌ పత్రాలు ఇస్తున్న బీఎల్‌ఓ

ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ షురూ.. జూలై 24 వరకు కొనసాగనున్న ప్రక్రియ  

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్‌) కార్యక్రమం గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ)లు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేయడం ప్రారంభించారు. బీఎల్‌ఓల వెంట ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు (బూత్‌ లెవెల్‌ ఏజెంట్లు) కూడా ఉన్నారు. జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. తొలుత బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఈ ఫారాలను పంపిణీ చేస్తారు. ఓటర్లు పూర్తి వివరాలు నింపిన తర్వాత తిరిగి వాటిని సేకరిస్తారు. ఎవరికైనా ఈ ఫామ్‌లు అందకపోతే ఆన్‌లైన్‌లో ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 

ఈ ఎన్యూమరేషన్‌ ఫారాలను తెలుగులో కూడా ముద్రించారు. జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించనున్నారు. అనంతరం జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. సెపె్టంబర్‌ 28 వరకు ఈ అభ్యంతరాలు పరిష్కరిస్తారు. అక్టోబర్‌ 1న తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement