సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కృష్ణయ్య భేటీ  | BC Leader R Krishnaiah Meet NV Ramana Chief Justice of Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో కృష్ణయ్య భేటీ 

Aug 13 2022 2:59 AM | Updated on Aug 13 2022 4:19 PM

BC Leader R Krishnaiah Meet NV Ramana Chief Justice of Supreme Court - Sakshi

కాచిగూడ (హైదరాబాద్‌): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ ఆహ్వానం మేరకు శుక్రవారం ఆయనను న్యూఢిల్లీలో వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువ్యక్తి ఉండటం తెలుగు జాతికి గర్వకారణమని ఆర్‌.కృష్ణయ్య ప్రశంసించారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, లాల్‌ కృష్ణ, మోక్షిత్‌ తదితరులున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement