విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | AR Rahman Concert Effect: Heavy Traffic Jam At Vijayawada High Way | Sakshi
Sakshi News home page

విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Nov 8 2025 9:03 PM | Updated on Nov 8 2025 9:12 PM

AR Rahman Concert Effect: Heavy Traffic Jam At Vijayawada High Way

సాక్షి, హైదరాబాద్‌: విజయవాడ హైవేపై శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లు, బస్సులు చాలా నెమ్మదిగా  వాహనాలు ముందుకు కదులుతున్నాయి.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీత ప్రదర్శన నేపథ్యంలో భారీగా అభిమానులు తరలి వచ్చారు. అటు నిర్వాహకులు, ఇటు పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది. ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు నెట్టింట తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement