థ్యాంక్యూ.. ఎస్‌ఐ సార్‌.. | 8 year old boy missing case in Khairatabad | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ.. ఎస్‌ఐ సార్‌..

Jun 17 2025 8:17 AM | Updated on Jun 17 2025 8:17 AM

8 year old boy missing case in Khairatabad

ఖైరతాబాద్‌: తప్పిపోయి తిరుగుతున్న 8 సంవత్సరాల బాలుడిని ఎస్‌ఐ నాలుగు గంటల పాటు వెంటపెట్టుకొని వివరాలు సేకరించి ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సయంలో కేర్‌ హాస్పిటల్‌ సమీపంలో రోడ్డుపై ఏడుస్తూ ఉన్న బాలుడిని స్థానికులు ఖైరతాబాద్‌ పెట్రోలింగ్‌ వాహన సిబ్బందికి అప్పగించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ కనకా శ్రీరాములు బాలున్ని తన ద్విచక్రవాహనంపై  ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ సుమారు 5 గంటల పాటు బాలున్ని మచ్చిక చేసుకొని వివరాలు సేకరించారు. 

చివరకు రాత్రి 8.30 గంటలకు బాలున్ని బంజారాహిల్స్‌ రోడ్‌నెం 12లోని  శ్రీరాంనగర్‌ కాలనీలో ఉంటున్న తల్లి దండ్రులకు అప్పగించాడు. బిహార్‌కు చెందిన చందన్‌ భార్యతో కలిసి నగరానికి వచ్చి ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు రెండవ సంతానమైన ఆశిష్‌ కుమార్‌ సోమవారం స్నేహితులతో కలిసి ఆడుకుంటూ తప్పిపోయాడు. కనిపించకుండా పోయిన బాబుకోసం వారు సాయంత్రం నుంచి వెతుకుతున్నారు. అంతలోనే ఎస్‌ఐ నేరుగా బాబును తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు  ఎస్‌ఐ శ్రీరాములకు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement