తిరువళ్లూరు: సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు 502 వినతులు రాగా వాటిని తక్షణం పరిష్కరించాలని ఆయాశాఖలకు చెందిన అధికారులకు కలెక్టర్ కవిత ఆదేశాలు జారీ చేశారు. కాగా వచ్చిన మొత్తం వినతుల్లో పట్టాల కోసం 133 వినతులు, ఉపాధీ కోసం 107 వినతులు, పక్కాగృహాల కోసం 51 వినతులు, మౌలిక సదుపా యాలు కల్పించాలని కోరుతూ 46 వినతులతో సహా మొత్తం 502 వినతులు వచ్చినట్టు కలెక్టర్ తెలిపారు. వీటిలో అర్హత వున్న వాటిని తక్షణం పరిష్కరించాలని కాని పక్షంలో అందుకు గల కారణాలను ఫిర్యాదుదారుడికి వివరించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రత్యేక ప్రతిభావంతులకు వేర్వేరు సంక్షేమ పథకాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్‌కుమార్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేషన్, ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ మురుగవేలు పాల్గొన్నారు.


