ఉచిత బస్సు సౌకర్యం | - | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సు సౌకర్యం

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

● పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ప్రకటన

గ్రామీణ విద్యార్థులకు..

సాక్షి, చైన్నె: గ్రామీణ ప్రాంతాల నుండి పుదుచ్చేరిలోని కళాశాలలకు వచ్చే విద్యార్థులకు, పాఠశా ల విద్యార్థుల తరహాలోనే త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం వెల్లడించారు. అలాగే, భారతిదాసన్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రభుత్వమే విద్యార్థినులకు అల్పాహారం అందించేందుకు చర్య లు తీసుకుంటోందని ఆయన తెలిపారు. వివరాలు.. భారతిదాసన్‌ ప్రభుత్వ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థినుల ప్రవేశాల ప్రక్రి య సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి ప్రవేశాల ప్రక్రియను ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి నమశ్శివాయం మాట్లాడుతూ, రెండవసారి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను హాజరవుతున్న తొలి కార్యక్ర మం ఇది అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో విద్యార్థినులు చదువుకోవడానికి పుదుచ్చేరికి వస్తున్నారని వివరించారు. పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఉన్నట్లే, గ్రామాల నుండి నగరానికి వచ్చే కళాశాల విద్యార్థులకు కూడా ఉచిత బస్సు సేవలను అందుబాటులో కి తేవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఉచిత అల్పాహార పథకం:

ప్రస్తుతం కళాశాల విద్యార్థినులకు పూర్వ విద్యార్థులు అల్పాహారం అందిస్తున్నారని గుర్తు చేస్తూ, త్వరలోనే ప్రభుత్వమే కళాశాల విద్యార్థులకు ఉద యం వేళలలో అల్పాహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం షిఫ్ట్‌ పద్ధతిలో నడుస్తున్న భారతిదాసన్‌ కళాశాలను పూర్తిస్థాయి రెగ్యులర్‌ కళాశాలగా నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement