75 శాతం దర్శకులకు సపోర్ట్‌ వారే..! | - | Sakshi
Sakshi News home page

75 శాతం దర్శకులకు సపోర్ట్‌ వారే..!

Aug 18 2026 7:34 AM | Updated on Aug 18 2026 7:34 AM

తమిళసినిమా: నటుడు గురు సోమసుందరం, నటి అనుమోల్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ప్యారీస్‌ కఫే. అర్చన కుమార్‌, విజయ్‌ విశ్వ, సాయి విక్కీ,నయన తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని థండర్‌ మీడియా పతాకంపై కణ్మణి రంగనాధన్‌ నిర్మించారు.వెంగళ్‌ ఎం.లింగేశ్వరన్‌ సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను సరాజ్‌ సీలన్‌ నిర్వహించారు. కే సంగీతాన్ని, సతీష్‌ ఛాయాగ్రహణం ను అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కణ్మణి రంగనాధన్‌ మాట్లాడుతూ దర్శకత్వం వహించాలన్నది ఈ చిత్ర దర్శకుడు తన భర్త సరాజ్‌ సీలన్‌ చిన్న నాటి కోరిక అన్నారు. తానే ఆయన్ని ఇప్పటి వరకు కట్టడి చేస్తూ వచ్చానని, ఆ సమయం ఆసన్నం కావడంతో ఈ చిత్రాన్ని చేసినట్లు చెప్పారు. ఇది చిన్న చిత్రం అయినా పెద్ద విషయం ఉన్న చిత్రం అని పేర్కొన్నారు. ప్యారీస్‌ కఫే కచ్చితంగా అందరి మనసులను హత్తుకుంటుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేశారు. తాను చదువుకునే రోజీల నుంచి సినిమా అంటే ఆసక్తి అని దర్శకుడు సరాజ్‌ సీలన్‌ చెప్పారు. నటుడు గురు సోమసుందరం మాట్లాడుతూ కోడంబాక్కమ్‌ లో 75 శాతం మంది సహయ దర్శకులు, దర్శకులకు ఆర్థిక సపోర్ట్‌ వారి భార్యా లేనని అన్నారు. వాళ్లంతా ఉద్యోగులు చేసి దర్శకులకు మోరల్‌ సపోర్ట్‌గా నిలుస్తున్నారన్నారు. అయితే సరాజ్‌ సీలన్‌కు ఆయన భార్యనే నిర్మాతగా మారి దర్శకుడిని చేశారని పేర్కొన్నారు. సరాజ్‌ సీలన్‌ తనకు ఫోన్‌ చేసి కథ చెప్పగానే చాలా బాగుందనీ , మీరు చెప్పినట్లుగా ఈ కథను తెరపై ఆవిష్కరించగలిగితే హిట్‌ అవుతుందని చెప్పానన్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా నిర్మాత చాలా సంతోషంగా ఉన్నారని గురు సోమసుందరం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement