సినిమా గుమ్మం దాటని వారసులు
తమిళసినిమా: ఒక్కో సారి మంచి చిత్రాలకు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతుంటాయి. అలాంటి చిత్రాల్లో 3.6.9 చిత్రం ఒకటి. శివ్ మాదవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 100 మంది నటీనటులతో 81 నిమిషాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని వరల్డ్ రికార్డ్ కెక్కింది. సైంటిఫిక్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం 2023లో తెరపైకి వచ్చింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 100కు పైగా ధియేటర్లలో విడుదలైంది. విమర్శకు ప్రశంసలు సైతం పొందింది. అయితే సరైన పబ్లిసిటీ లేని కారణంగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది అని ఆ చిత్ర దర్శకుడు శివ్ మాధవ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన అందులో తెలుపుతూ తాజాగా మరో భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులతో సూపర్ హీరో కథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. ఈసారి పక్కా కమర్షియల్ అంశాలతో జనరంజక కథా చిత్రాన్ని చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం మినీయేచర్ వర్క్ జరుగుతోందని చెప్పారు. ఈ చిత్ర కథ సైన్స్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. హాలీవుడ్ స్టైల్ లో భారీ సెట్స్ వేసి సరి కొత్త ప్రయోగాలతో చిత్రాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు చెప్పారు. ఈ చిత్రం కోసం మూడేళ్ల పాటు వీఎఫ్ ఎక్స్ నుంచి ఏఐ వరకు అన్ని నేర్చుకుని వచ్చినట్లు చెప్పారు.చిత్ర షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నట్లు దర్శకుడు తెలిపారు.
తమిళసినిమా: సినిమా చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం ప్రేక్షకులపైనే కాకుండా, చిత్ర రంగంలోని వారిపైనా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా ఇది రంగుల ప్రపంచం. ఒక్కసారి ఎంటర్ అయితే అందులో నుంచి బయటపడటం అసాధ్యమనే చెప్పాలి. విజయపథంలో ఉన్న వారు మరింత ఉన్నత స్థాయి కోసం, విజయాలు లేని వారు దాన్ని అందుకోవడం కోసం నిరంతరం పరితపిస్తూనే ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే వారసులు సినిమా గుమ్మం దాటడానికి సుముఖత చూపడం లేదనే చెప్పాలి. చాలా మంది నటీనటులు, దర్శక నిర్మాతల వారసులు ఇక్కడే విజయాలను వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు చిన్న ఉదాహరణ నటి కుష్బూ సుందర్ వారసురాళ్లు. ఈమె ఇద్దరు కూతుళ్లలో ఒకరు కథానాయకిగాను, మరొక నిర్మాత గాను రంగంలోకి దిగారు. ఈ పుట్టింట్లో నటి దేవయాని రాజ్ కుమార్ వారసురాలు చేరారు. దేవయాని ప్రముఖ కథానాయకి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమె భర్త రాజ్ కుమార్ ప్రముఖ దర్శకుడు అన్నది తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు.అందులో పెద్ద కూతురు ఇనియ. రెండవ కూతురు ప్రియాంక. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే రాజ్‌కుమార్, దేవయాని దంపతులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దారు. అదేవిధంగా వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అయితే వారిద్దరు తల్లిదండ్రుల వారసత్వాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. పెద్ద కూతురు బుల్లి తెరను తన పయనంగా ఎంచుకున్నారు. టీవీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకుల్లో పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా సెల్ఫీ రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇక రెండవ కూతురు కథానాయకిగా రంగప్రవేశం చేశారు. నటుడు ప్రశాంత్ హీరోగా నటిస్తున్న రంజన్ ది అడ్వకేట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో మంచి హిట్ అయిన కోర్టు చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇలా చాలా మంది సినీ వారసులు సినిమా గుమ్మం దాటడం లేదు.


