రైలులో చైన్నె
ప్రయాణికుడి మృతి
అన్నానగర్: చైన్నె తాంబరం నుండి కన్యాకుమారికి ఆదివారం, సోమవారం మరియు బుధవారాల్లో ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. ఈ రైలు సోమవారం ఉదయం 7 గంటలకు కన్యాకుమారి స్టేషనన్‌కు చేరుకుంది. ప్రయాణికులందరూ రైలు దిగిపోయిన తర్వాత, రైల్వే అధికారులు కోచ్ లలోకి వెళ్లి చూడగా, రిజర్వ్ చేసిన కోచ్ లలోని ఒకదానిలో ఒక ప్రయాణీకుడు చనిపోయి కనిపించాడు. ఈ విషయంపై సమా చారం అందుకున్న నాగర్ కోయిల్ రైల్వే పోలీసులు కన్యాకుమారికి వెళ్లి, రైలులో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. పర్సును తనిఖీ చేయగా, అందులో ఆధార్ కార్డు లభించింది. కార్డులోని వివరాల ప్రకారం, మృతుడు చైన్నెలోని తాంబరం, మదంబాక్కం, అగరమ్ దక్షిణ ప్రాంతానికి చెందిన వెంకటరమణన్ (72) అని తేలింది. అనంతరం, చైన్నెలోని అతని కుటుంబానికి సమాచా రం అందించారు. వారు కన్యాకుమారి జిల్లా, సుచింద్రంలో ఉన్న వెంకటరమణన్ బంధువులకు సమాచారం అందించారు. దానికి అనుగుణంగా, వారు వెంటనే కన్యాకుమారి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. వెంకటరమణన్ కన్యాకుమారిలోని ఒక బంధువు ఇంట్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి చైన్నె నుండి బయలుదేరాడు. అతను రైలులోనే మరణించినట్లు తేలింది. ఆరోగ్య సమస్యల కారణంగా అతను సహజ కారణాలతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.
పూర్వ విద్యార్థుల కోసం డిజిటల్ నెట్ వర్కింగ్
సాక్షి,చైన్నె : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పూర్వ విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ‘ఆల్మాషైన్స్’ సహకారంతో రూపుదిద్దుకున్న కొత్త డిజిటల్ నెట్‌వర్కింగ్ వేదిక ను సోమవారం శ్రీహెర్‌లో ప్రారంభించారు. ఆవిద్యా సంస్థ చాన్స్‌లర్ వి.ఆర్. వెంకటాచలం, ట్రస్టీ సంయుక్త వెంకటాచలం దీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఈ కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పూర్వ విద్యార్థుల మధ్య పరస్పర సహకారం, మార్గదర్శకత్వం, సామాజిక సేవలు మరింత బలోపేతం అవుతాయని ప్రకటించారు.
ఘనంగా అగ్నిగుండ మహోత్సవం
తిరువొత్తియూరు: ఒత్తివాక్కం శ్రీ సెల్లియమ్మన్ – శ్రీ సెంగళని అమ్మన్ ఆలయంలో 24వ సంవత్సర అగ్ని గుండం ఉత్సవం ఘనంగా నిర్వహించారు. చెంగల్పట్టు జిల్లా, వండలూరు తాలూకా, ఒత్తివాక్కం గ్రామంలో వేంచేసియున్న శ్రీ తీపాంజమ్మన్, శ్రీ పళండియమ్మన్, శ్రీ సెల్లియమ్మన్, శ్రీ సెంగళని అమ్మన్ ఆలయాల 24వ సంవత్సర ఆడి ఉత్సవాలు ఉత్సవం ఆగ స్టు 16వ తేదీన వైభవంగా చేపట్టారు. ఆడి నెల 31వ తేదీ, చతుర్థి తిథి, హస్త నక్షత్రం అమృత యోగం కూడిన శుభదినాన జరిగిన ఈ ఉత్సవంలో, సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో నిప్పులు తొక్కడం, ఉయ్యాల సేవ నిర్వహించారు. దీనిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయి. అనంతరం జరిగిన నిప్పు తొక్కు కార్యక్రమంలో భక్తులు భక్తిపారవశ్యంతో పాల్గొని, నిప్పులు తొక్కి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు.
కరాటేలో నవశక్తి
గిన్నిస్ రికార్డు
సాక్షి, చైన్నె: తిరుపతికి చెందిన ర్యాలీ నవశక్తి కరాటేలో గిన్నిస్ రికార్డ్ సాధించింది. చైన్నెలో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ (డబ్ల్యూకే ఎంఏ) ఆధ్వర్యంలో గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో ఆదివారం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ పోటీలు నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, గోవా, ఛత్తీస్‌ఘడ్, బిహార్, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు శ్రీలంక, థాయ్‌లాండ్, దుబాయ్ దేశాల నుంచి కరాటే క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో మాస్టర్స్ కేటగిరీలో నవశక్తి సత్తా చాటారు. ఒకటిన్నర నిమి షం వ్యవధిలో విన్యాసాల క్రమాన్ని పూర్తిచేసి రికార్డు సృష్టించారు. వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలమురుగన్ చేతుల మీదుగా పతకం, గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ అందుకున్నారు. పిన్న వయస్సులోనే మరో గిన్నిస్ రికార్డు సాధించడంతో పలువురు ఆమెను అభినందించారు. 2019లో నెల్లూరులో నిర్వహించిన కరాటే పోటీల్లోనూ నవశక్తి గిన్నిస్ రికార్డు సాధించారు.


