సాక్షి,చైన్నె: డీఎంకే దివంగత నాయకుడుకలైంజ్ఞర్ ముత్తువేల్ కరుణానిధికి తన చివరి శ్వాస వరకు అత్యంత విశ్వసనీయంగా సేవలందించిన నిష్కళంక ద్రావిడ యోధుడు, మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరిస్తూ పలువురునాయకులు ఘనంగా సోమవారం నివాళులర్పించారు. అరిజ్ఞర్ అన్నా అడుగుజాడల్లో నడుస్తూ మురసోలి మారన్ చేసిన ప్రసంగాలు, ఆయన రచించిన పుస్తకాలు ద్రావిడ ఉద్యమంలోని నేటి యువత ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పాఠ్యపుస్తకాలుగా నిలిచాయని ఈ సందర్భంగా స్టాలిన్ పేర్కొన్నారు. ఒక సాధారణ తంజావూరు డెల్టా బిడ్డగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఢిల్లీ వేదికగా కేంద్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారన్నారు. తాను సాధించిన ప్రతి విజయాన్ని, కీర్తిని తన మార్గదర్శి కరుణానిధికే అంకితమిచ్చిన నిబద్ధత కలిగిన నాయకుడు మురసోలి మారన్ అని కొనియాడారు.కోడంబాక్కంలోని మురసోలి మారన్ విగ్రహానికి స్టాలిన్‌తో పాటూ డీఎంకే నేతలు టీఆర్‌బాలు, రాజ, దయానిధి మారన్ పాల్గొన్నారు.


