ఉత్తర అమెరికాలో ఇళయరాజా 50 ఏళ్ల సంగీత కచ్చేరిలు | - | Sakshi
Sakshi News home page

ఉత్తర అమెరికాలో ఇళయరాజా 50 ఏళ్ల సంగీత కచ్చేరిలు

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

తమిళసినిమా: 15 వందలకు పైగా చిత్రాలు, 9 వేలకు పైగా పాటలకు సంగీతాన్ని సమకూర్చిన సంగీతజ్ఞాని ఇళయరాజా. ఈయన సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా అబిమానులు ఉన్నారు. ఇళయరాజానే పలు మార్లు విదేశాల్లో సంగీత విభావరి కార్యక్రమాలను నిర్వహించారు. కాగా ఈయన 50 ఏళ్ల సంగీత పయనాన్ని వేడుకగా జరుపుకునే విధంగా సరిగమ లైవ్‌,మెర్కూరి సంస్థలు ఉత్తర అమెరికాలో సంగీత కచ్చేరిలను నిర్వహించనున్నారు. ఆగస్ట్‌ నెలలో అమెరికా, కెనడా మొదలగు 10 ప్రధాన నగరాల్లో సంగీత కచ్చేరీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా లాస్‌ఏంజల్స్‌లోని డాల్ఫి థియేటర్లలోనూ, బే ఏరియాలో ఉన్న ఒక్లాండ్‌ ఏరియాలోని ముఖ్య వేదికలపై ఇళయరాజా ఐకాన్‌ సంగీతం మారుమోగనుందని పేర్కొన్నారు. ఈ కచ్చేరీలు పూర్తి ఆర్కెస్ట్రాతో రూపొందించినట్లు తెలిపారు.

ఇళయరాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement